`శేఖ‌ర్‌` చిత్రం మే 20న విడుద‌ల‌

Admin 2022-04-24 05:17:09 ENT
టాలీవుడ్ యాంగ్రీ హీరో డాక్టర్ రాజ‌శేఖ‌ర్ న‌టించిన 91వ చిత్రం `శేఖ‌ర్‌`. ఈ చిత్రం పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై రూపొందింది. బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరంతో పాటు రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

ఈ చిత్రం విడుద‌ల తేదీ పోస్ట‌ర్‌ను శ‌నివారంనాడు విలేక‌రుల స‌మావేశంలో విడుద‌ల చేశారు. మే 20న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లు జీవితా రాజ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించారు. కాగా ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కుమార్తె పాత్రలో నటించారు.