'హరిహర వీరమల్లు'లో హాట్​ బ్యూటీ ఎవరో తెలుసా?

Admin 2022-04-24 05:03:38 ENT
'హరిహర వీరమల్లు' మూవీలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా నటించబోతున్నారట. ఇప్పటికే నోరా.. టాలీవుడ్‌లో బాహుబలి, టెంపర్, ఊపిరి, లోఫర్ చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేసి సూపర్​ క్రేజ్ సంపాదించుకున్నారు.

పవన్ కల్యాణ్​ నటిస్తున్న 'హారిహర వీరమల్లు'లో కీలక పాత్రను చేసే అవకాశమందని సమాచారం. త్వరలోనే చిత్రబృందం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇటీవలే పవన్​ సెట్స్​లో కసరత్తులు చేస్తున్న ఫొటోలను పోస్టు చేసింది చిత్రబృందం. నిపుణుల ఆధ్వర్యంలో బల్లెంతో పోరాట ఘట్టానికి సంబంధించిన సన్నివేశాల కోసం పవన్​ శిక్షణ తీసుకున్నారు.