- Home
- tollywood
మహేశ్ ను సెట్స్ పైకి తీసుకెళుతున్న రాజమౌళి!
అందరి దృష్టి రాజమౌళి నెక్స్ట్ మూవీపైనే ఉంది. తన తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందనీ, అయితే ఇది మల్టీ స్టారర్ సినిమా కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు కూడా. ఇక ఈ సినిమా దక్షిణాఫ్రిక అడవుల నేపథ్యానికి సంబంధించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ గా కొనసాగనుందని ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ సినిమాను దసరాకి లాంచ్ చేయనున్నారనేది తాజా సమాచారం. ఈ లోగా అన్ని పనులను పూర్తిచేసుకుని, దసరా రోజున పూజా కార్యక్రమాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నారట.