- Home
- bollywood
'భవదీయుడు భగత్ సింగ్'లోని ఇక కీలకమైన పాత్ర లో : రవీనా టాండన్
సీనియర్ హీరోయిన్స్ లో రవీనా టాండాన్ ఒకరు. తెలుగులో ఆమె కొన్ని సినిమాలు చేసినప్పటికీ, బాలకృష్ణ సరసన చేసిన 'బంగారు బుల్లోడు' సినిమా ఆమెకి మంచి హిట్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె వరుస హిందీ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.
'భవదీయుడు భగత్ సింగ్'లోని ఇక కీలకమైన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. రవీనా పాత్ర గురించి ఆమెకి చెప్పడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాతో రవీనా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందని చెబుతున్నారు.