అందుకే కాజల్ పాత్రను తొలగించాం :క్లారిటీ ఇచ్చిన కొరటాల

Admin 2022-04-25 02:55:30 ENT
'ఆచార్య' సినిమాలో కాజల్ పాత్ర ఉందా? లేదా? అనే చర్చకు దర్శకుడు కొరటాల శివ తెరదించారు. కాజల్ పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. సరైన ప్రాధాన్యత లేని పాత్రలో హీరోయిన్ ను వాడుకోవడం కరెక్ట్ కాదనేది తన అభిప్రాయమని ఆయన చెప్పారు.

చిరంజీవి పాత్రకు ప్రేమపై ఆసక్తి ఉండదని... అయితే కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని కాజల్ పాత్రను చొప్పించడానికి ట్రై చేశానని తెలిపారు. తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత అవుట్ పుట్ చూశానని...

చిరంజీవి గారితో చెపితే... కాజల్ పాత్రను ఉంచాలా? వద్దా? అనే విషయాన్ని తనకే వదిలేశారని కొరటాల శివ అన్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని కాజల్ కు చెప్పానని... ఆమె నవ్వుతూనే స్పందించిందని చెప్పారు. దీంతో, 'ఆచార్య' నుంచి కాజల్ పాత్రను పూర్తిగా తప్పించామని అన్నారు.