త్వరలో డెట్రాయిట్ లో లొకేషన్ల ఎంపిక

Admin 2020-09-16 11:23:11 entertainmen
మహేశ్ బాబు చిత్రం యూనిట్ అమెరికా వెళ్లడానికి రెడీ అవుతోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'సర్కారు వారి పాట' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. బ్యాంకులను మోసం చేసి భారీ ఎత్తున రుణాలు తీసుకుని, ఎగవేసి, విదేశాలకు పారిపోయే వ్యక్తుల కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మహేశ్ డ్యూయల్ రోల్స్ పోషిస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి. అమెరికాలో కూడా కొంత భాగం షూటింగ్ చేయాలట. దాంతో అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడానికి చిత్రం యూనిట్ గత కొన్నాళ్లుగా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని డెట్రాయిట్ లో చిత్రీకరణ నిర్వహించాలని ఫిక్స్ అయినట్టు తాజా సమాచారం. దీంతో దర్శకుడు, కెమేరా మేన్ త్వరలో డెట్రాయిట్ కు వెళ్లి లొకేషన్లను ఖరారు చేస్తారని తెలుస్తోంది.