- Home
- tollywood
మహేశ్ బాబు సినిమాలో విద్యాబాలన్
మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'ను కూడా పాన్ ఇండియా మూవీగా నిర్మించే యోచన చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విలన్ పాత్రకు బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ని తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఇక సినిమాలో మరో కీలక పాత్ర అయిన హీరో తల్లి పాత్రకు ప్రముఖ నటి విద్యాబాలన్ తో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆమె కూడా ఈ సినిమా చేయడానికి సానుకూలంగా వున్నట్టు సమాచారం. తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో నిర్వహించడానికి నిర్ణయించారు. త్వరలోనే చిత్ర దర్శకుడు, కెమేరామేన్ కలసి లొకేషన్ల ఎంపికకు డెట్రాయిట్ వెళతారని అంటున్నారు. అక్కడ 45 రోజుల పాటు షూటింగును నిర్వహిస్తారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అక్కడ షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.