- Home
- bollywood
షారూఖ్ ఇంటి నేమ్ ప్లేట్ ఖర్చు ఎంతో తెలుసా ...!
బాలీవుడ్ బాద్ షాకు తన ఇల్లు ‘మన్నత్’ అంటే ఎంతో ఇష్టం. అందులో భాగంగా ఇంటి నామ ఫలకాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ‘మన్నత్– ల్యాండ్స్ ఎండ్’ అంటూ నిలువు అక్షరాలతో నేమ్ ప్లేట్ కు రూపునిచ్చారు.
ఇంటీరియర్ డిజైనర్ అయిన షారూఖ్ భార్య గౌరీ ఖాన్.. ఆ నేమ్ ప్లేట్ కు తన నైపుణ్యాలతో రూపాన్నిచ్చింది. మామూలుగా అయితే దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. కానీ, దానికి పెట్టిన ఖర్చే ఇప్పుడు చర్చకు దారి తీసింది. అవునుమరి, ఆరడుగుల శిలాఫలకానికే రూ.25 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఆ డబ్బుతో సామాన్యుడు ఓ చిన్నపాటి ఇంటిని కొనుక్కొని సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు.