- Home
- tollywood
ప్రభాస్ జోడీగా అనుష్క : మారుతి
ప్రభాస్ - అనుష్క జంటకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్. 'బాహుబలి 2' తరువాత ఈ జంట తెరపై కలిసి కనిపించలేదు. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అనుష్క పూర్తిగా సినిమాలను తగ్గించి వేసింది.
ఈ జంటను మళ్లీ తెరపైకి తీసుకుని రావడానికి చాలామంది దర్శకులు ట్రై చేస్తున్నారు. ఆ జాబితాలో మారుతి పేరు కూడా వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి 'రాజా డీలక్స్' సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా పనులు జరుగుతున్నాయి.