- Home
- tollywood
పెళ్లి కోసమే కొత్త సినిమాలు ఒప్పుకోలేదని ప్రచారం : సాయి పల్లవి
సాయి పల్లవి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆమె అద్భుతమైన నటన. ప్రస్తుత హీరోయిన్లందరూ తమ గ్లామర్ ను నమ్ముకుని సినిమాలు చేస్తుంటే... సాయి పల్లవి మాత్రం తన టాలెంట్ ను నమ్ముకుని వరుస సినిమాలు చేస్తోంది. ఆమె నటనకు ఎంతో మంది సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. ఇంటిల్లిపాది అభిమానించే నటి ఎవరని అడిగితే...
అందుకు తగ్గట్టుగానే గత కొంత కాలంగా ఆమె కొత్తగా ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. పెళ్లి కోసమే ఆమె కొత్త చిత్రాలకు సైన్ చేయలేదనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఇటీవలి కాలంలో ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది.
అయితే, ఈ వార్తలపై సాయి పల్లవి ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ, ఆమె సన్నిహితులు మాత్రం స్పందించారు. సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతోందనే వార్తల్లో నిజం లేదని వారు చెప్పారు. మంచి క్యారెక్టర్ల కోసం ఆమె ఎదురు చూస్తోందని... మంచి పాత్రలు దొరికితే ఆమె కొత్త సినిమాలో నటిస్తుందని తెలిపారు. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.