- Home
- tollywood
'ఎఫ్ 3' 9వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు
ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇటీవల వదిలిన 'ఊ ఆ అహ అహ' అనే పాట బాగా పాప్యులర్ అయింది. ఫస్టు పార్టుకి మించిన కామెడీ సెకండ్ పార్టులో ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు.
తమన్నా .. మెహ్రీన్ అందాలు ఒలకబోసిన తీరు, సోనాల్ చౌహన్ గ్లామర్ తళుకులు .. పూజ హెగ్డే ఐటమ్ సాంగ్ చూస్తే, రొమాన్స్ విషయంలో కూడా సెకండ్ పార్టు తక్కువేం తినలేదనే విషయం తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. మురళీశర్మ .. సంగీత .. అంజలి .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.