- Home
- tollywood
బాలీవుడ్ నుంచి తనకు అవకాశాలు పెద్దగా రాలేదన్న మహేశ్
దక్షిణాదిన తెలుగు పరిశ్రమలో గొప్ప స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో మహేశ్ బాబు బాలీవుడ్ వైపు ఎందుకు వెళ్లలేదు..? ఇదే ప్రశ్న ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా మహేశ్ బాబు ఎదుర్కొన్నారు. తనను బాలీవుడ్ పరిశ్రమ భరించలేదంటూ ఆయన ఇచ్చిన సమాధానం అవాక్కయ్యేలా చేసింది.
‘‘హిందీ పరిశ్రమ నుంచి నాకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. నన్ను వారు భరించగలరని అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పనిచేయడం ద్వారా నా సమయం వృథా చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇక్కడి పరిశ్రమలో నాకు వచ్చిన గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ పట్ల నేను సంతోషంగా ఉన్నాను. అందుకే, నా పరిశ్రమను విడిచి పెట్టే ఆలోచన చేయను. సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలనే ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది’’ అంటూ మహేశ్ బాబు వివరించారు.