విడాకులు తీసుకోవాలనుకుంటున్న సొహైల్, సీమా ఖాన్

Admin 2022-05-16 01:54:01 ENT
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ ఖాన్ తన భార్య మలైకా అరోరాకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇప్పుడు వేరే వ్యక్తులతో జీవితాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సల్మాన్ చిన్న తమ్ముడు సొహైల్ ఖాన్ కూడా తన భార్య సీమా ఖాన్ నుంచి విడిపోతున్నాడు.

24 ఏళ్ల క్రితం సొహైల్ ఖాన్, సీమా ఖాన్ లు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నారని బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ రిలేషన్ షిల్ లో ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆమె వల్లే సొహైల్, సీమాలు విడిపోతున్నారని చెపుతున్నారు. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.