బాలయ్య సినిమా కోసం డింపుల్ హయతి మాస్ మసాలా సాంగ్!

Admin 2022-05-17 12:48:04 ENT
గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులను తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు బాలకృష్ణతో కలిసి ఆమె ఒక మాస్ మసాలా సాంగ్ లో సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య 107వ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కథ రాయలసీమ నేపథ్యంలో నడుస్తుంది. బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ సినిమా కోసం మాస్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ నెంబర్ ను తమన్ కంపోజ్ చేశాడట. ఆ పాటను డింపుల్ పై చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.