ఆ రోజున మహేశ్ మూవీ టైటిల్ రిలీజ్ చేసే ఆలోచన

Admin 2022-05-17 12:45:57 ENT
త్రివిక్రమ్ - మహేశ్ బాబు సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని కొంతమంది వెయిట్ చేస్తుంటే, మరి కొంతమంది ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టనున్నారనే విషయంలో కుతూహలాన్ని వ్యక్తం చేస్తున్నారు. జులైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈ నెల 31వ తేదీన ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భంగా మహేశ్ బాబు 28వ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్టు చెబుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాలో, మహేశ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.