- Home
- tollywood
అందమైన అల్లరి పేరే అనుపమ
అనుపమ పరమేశ్వరన్ .. కుదురైన రూపం .. కుందనపు బొమ్మలాంటి లావణ్యం ఆమె సొంతం. 'ప్రేమమ్' మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన ప్రయాణం ఆపకుండా ఆమె ముందుకు వెళుతూనే ఉంది. ఒకవైపున తెలుగు సినిమాలు చేస్తూనే, మరో వైపున తమిళ .. మలయాళ భాషల్లో గ్యాప్ రాకుండా చూసుకుంటోంది. అనుపమ మోడ్రన్ డ్రెస్సుల్లోను .. సంప్రదాయ బద్ధమైన చీరకట్టులోను అందంగా కనిపిస్తుంది .. అరవిందంలా వికసిస్తుంది. అందువల్లనే ఈ రెండు తరహా పాత్రలను ఆమెకి ఇవ్వడానికి మేకర్స్ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలా పట్టుచీరకట్టులోని ఆమె పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కుర్రాళ్ల హార్ట్ వాల్స్ పై పోస్టర్లుగా వెలుస్తున్నాయి.