- Home
- tollywood
'బీర్బల్'తో పరిచయమైన రుక్మిణి వసంత్
ఫీల్ గుడ్ గా అనిపించే ప్రేమకథా చిత్రాలు ఈ మధ్య కాలంలో రావడం లేదు. ఒక 'గీతాంజలి' .. 'అభినందన' సినిమాలు చూస్తే, ప్రేమకథలకు ఫీల్ ఎంతవరకూ అవసరమనేది అర్థమవుతుంది. ఆ సినిమాల్లోని పాటలు కూడా సూపర్ హిట్. ఆ కథల్లో హీరో - హీరోయిన్ కలిసి జర్నీ చేస్తారు. కానీ అసలు హీరో - హీరోయిన్ కలుసుకోకుండానే యూత్ ను కట్టిపడేసేలా సినిమా తీయవచ్చనే విషయాన్ని 'సప్తసాగరాలు దాటి సైడ్ బీ' నిరూపించింది.
ఈ సినిమాలో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించగా, కథానాయికగా రుక్మిణి వసంత్ కనిపిస్తుంది. నటిగా ఆమెకి చాలా అనుభవం ఉందనుకుంటే పొరపాటే, 'బీర్బల్' సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమెకి, 'సప్తసాగరాలు దాటి సైడ్ ఎ' రెండో సినిమానే. ఆ సినిమాతోనే ఆమె కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా .. అందమైన భావాలున్న ప్రియురాలిగా ఆమె మంచి మార్కులు కొట్టేసింది.