Kannappa : ఇటీవల న్యూజిలాండ్ లో తొలి షెడ్యూల్ పూర్తి

Admin 2024-02-04 20:18:04 ENT
టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప త్వరలోనే రెండో షెడ్యూల్ లో అడుగుపెట్టనుంది. కన్నప్ప చిత్రానికి మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే న్యూజిలాండ్ లో సుదీర్ఘంగా తొలి షెడ్యూల్ జరుపుకున్న కన్నప్ప చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తొలి షెడ్యూల్ లో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి హేమాహేమీలపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ కూడా నటిస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.