'ఫిట్ అండ్ హాట్' : పూజా హెగ్డే

Admin 2020-09-17 15:38:11 entertainmen
స్క్రీన్ మీద ఎంతగా అందచందాలు ఎర వేయాలంటే దానికి బాడీ ఫిట్నెస్ కూడా తోడవ్వాల్సిందే. హీరోయిన్స్ కి ఎన్ని హిట్స్ అందుకున్నా ఎంత క్రేజ్ తెచ్చుకున్నా స్టార్ స్టేటస్ అనేది కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు హీరోయిన్ అంటే సంప్రదాయబద్ధంగా ఉండేవారు.. యాక్టింగ్ వస్తే సరిపోతుంది... బొద్దుగా ఉన్నా పర్వాలేదు అనుకునేవారు. రాను రాను సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత తగ్గిపోయి నటీమణుల గ్లామర్ షోకి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ అయినా సరే అమ్మడు అందాలు ఆరబోస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.. ఫిలిం మేకర్స్ అవకాశాలు ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే చాలామంది హీరోయిన్స్ బికినీలు వేయడానికి.. గ్లామర్ షో చేయడానికి సిద్ధపడే వస్తున్నారు.