- Home
- tollywood
మిల్కీ బ్యూటీ తమన్నా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు రెడీ
స్టార్స్ ఎక్కువ మంది ఓటీటీ పై ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లకే ఎక్కువ క్రేజ్ ఉండేది. కాని ఈమద్య కాలంలో ఇండియాలో ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. కనుక పలువురు స్టార్స్ ఓటీటీలో కనిపించేందుకు ఓకే చెబుతున్నారు. సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. వెబ్ సిరీస్ లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో పారితోషికాలు కూడా భారీగా ఉంటున్నాయి. సినిమాలు అయినా ఓటీటీ అయినా పారితోషికం భారీగా వస్తే చాలు అనుకునే వారు వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు సిద్దం అవుతున్నారు.