- Home
- bollywood
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్
డ్రగ్స్ కేసులో అరెస్టైన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి విచారణలో పలువురి పేర్లు వెల్లడించిందని, అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉందని ఓ జాతీయ మీడియా ఇటీవల వార్తలు ప్రచురించింది. దీంతో అన్ని మీడియా చానెళ్లలోనూ రకుల్ పేరు మారుమోగిపోయింది. మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె ఈ రోజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల తన గురించి మీడియాలో వచ్చిన కథనాలను ఆమె తన లాయరు ద్వారా న్యాయస్థానానికి అందజేసింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ మీడియా వార్తలు రాస్తోందని, వీటిని ప్రసారం చేయకుండా నిలుపుదల చేయాలని కోరింది. జస్టిస్ చావ్లా బెంచ్ ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.