మాళవిక మోహనన్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలావుంటే, మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు బోల్డ్ అండ్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమికుల రోజు కావడంతో ఇంత కలర్ ఫుల్ గా మారిందని ట్రోల్ చేస్తున్నారు.
ఇక మాళవి తెలుగు సినిమా రాజా సాబ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా... మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి కల్కి (కల్కి).. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది మే 9న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించింది.