నిహారిక హాట్ షో.. సందడి చేసిన మెగా హీరోయిన్.. వైరల్ అవుతున్న పిక్స్..

Admin 2024-02-16 23:45:20 ENT
నిహారిక కొణిదెల డిజిటల్‌తో పాటు సినిమాల్లోనూ రాణిస్తున్న క్యూటీ. తెలుగులో ఇప్పటి వరకు మూడు చిత్రాల్లో కథానాయికగా నటించింది. మొదటి సినిమా 'ఒక మనసు' ఫర్వాలేదనిపించగా, ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె హీరోయిన్ గా నటించిన 'ముద్ద పప్పు ఆవకాయ' అనే వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది.

ఇదిలావుంటే, నిహారిక ఇటీవల తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో కాస్త హాట్ హాట్ గా పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే.. నిహారిక కాస్త సమయం తీసుకుని కొన్ని ఆసక్తికరమైన సినిమాలు చేస్తోంది. అందులో భాగమే తెలుగులోనే కాదు తమిళంలో కూడా. ఇప్పటికే విజయ్ సేతుపతితో ఓ సినిమా చేసిన ఆమె ఇప్పుడు ఆర్డీఎక్స్ నటుడు షేన్ నిగమ్‌తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది.

మద్రాస్ కరణ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు.