- Home
- tollywood
శ్రీలీల తల్లి కొన్ని కండిషన్స్...!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీలీల నటన, అందం, నృత్యం, అభినయం ఎందరో అభిమానులు మెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడి జోరు కాస్త తగ్గుతోంది. ఒకానొక సమయంలో శ్రీలీలకి వరుసగా అవకాశాలు వచ్చాయి. శ్రీలీల తన డేట్స్ అడ్జస్ట్ చేసుకోకుండా కొన్ని సినిమాలకు నో చెప్పేది. ఒకానొక సమయంలో ఈ అమ్మడు డేట్స్ కోసం దర్శకులు క్యూ కట్టేవారు అంటే ఈ అమ్మడికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శ్రీలీల కూడా వచ్చిన ప్రతి సినిమాకు ఓకే చెప్పింది.
యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంది శ్రీలీల. శ్రీలీల కూడా ఒక్కో సినిమాలో నటించే అవకాశాన్ని ఉపయోగించుకుంది. అయితే ఒకే ఒక్క సినిమాలో నటించేందుకు శ్రీలీల నో చెప్పింది. ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా మరెవరో కాదు టిల్లూ స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ శ్రీలీల ఈ సినిమాను మధ్యలోనే వదిలేసింది. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్‌ని వెతకడానికి మేకర్స్ చాలా టైమ్ తీసుకున్నారు. చివరగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని ఫిక్స్ చేసారు. ఈ బ్యూటీ కూడా ఈ సినిమాలో నటించడానికి వెంటనే ఓకే చెప్పలేదట.
చాలా టైం తీసుకుని ఓకే చెప్పింది. టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమణిని చూసి చాలా మంది అభిమానులు షాక్ అవుతున్నారు. అందులో అనుపమ్ ని చూసి కుర్రాళ్ల గుండె చప్పుడు పెరిగిపోతోంది. లిప్ లాక్ సీన్స్, రొమాన్స్ తో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. అలాంటి సన్నివేశాలు ఉన్నందున ఈ సినిమాలో నటించేందుకు శ్రీ లీల నో చెప్పింది. కెరీర్ ప్రారంభంలో శ్రీ లీల తల్లి... కొన్ని షరతులు పెట్టింది. రొమాంటిక్, హాట్ సీన్లు చేస్తే సినిమాలు మానేస్తానని శ్రీలీలకి ఆమె తల్లి కొన్ని కండిషన్స్ ఇచ్చింది. ఈక్రమంలోనే శ్రీలీల టిల్లు స్క్వేర్ ఆఫ ర్ నుంచి వైదొలిగింది.
అయితే లిప్ లాక్ సీన్స్, రొమాన్స్ చేయడానికి ముందుకు వచ్చిన అనుపమ ఈ సినిమాని అంగీకరించింది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. మార్చి 29న విడుదల కానున్న ఈ సినిమా కోసం కుర్రాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో అనుపమ అందం కోసం అనుపమ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.