రాధికా ఆప్టే : తెలుగు సినీ పరిశ్రమలో నేను చాలా కష్టపడ్డాను...!

Admin 2024-02-17 12:55:13 ENT
తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించి తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ రాధికా ఆప్టే.. ముఖ్యంగా రక్త చరిత్ర సినిమాలో కట్టుబొట్టుతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ తో కబాలి సినిమాలో కూడా నటించింది. బాలయ్యతో కలిసి లెజెండ్, లయన్ సినిమాల్లో కూడా నటించింది. ఈ బోల్డ్ బ్యూటీ తన అద్భుతమైన నటనతో చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్‌లో కూడా అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది.

రాధికా ఆప్టే ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ఉంటుంది. ఈ క్రమంలో రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమపై చాలా ఘాటుగా స్పందించింది. ఈ విషయంతో రాధికా ఆప్టే తన అభిమానులను కూడా హర్ట్ చేసింది..

"రాధికా ఆప్టే మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని.. తెలుగు చిత్ర పరిశ్రమలో నేను చాలా కష్టపడ్డానని అనుకుంటున్నా.

అంతేకాదు సినిమాల షూటింగ్ సెట్స్‌లో ఆడవాళ్లను చూసే విధానం.. వాళ్ల పాత్రలను చూపించే విధానం ఎప్పుడూ బలహీనంగానే ఉంటుంది.. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌ని మూడో వ్యక్తిగా మాత్రమే చూస్తారు.. నటీనటులను అడగకుండానే హీరోలు ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్లను రద్దు చేస్తూ ఉంటారని. తన జీవితంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి.. ఇదంతా కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే జరుగుతుందని రాధికా ఆప్టే ఘాటైన వ్యాఖ్యలు చేసింది."

దీంతో సోషల్ మీడియాలో ఆమె మాటలు వైరల్ అవుతున్నాయి. రాజీవ్ మసంద్ తో ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే ఈ మాటలు మాట్లాడినట్లు తెలుస్తోంది.. ఈ విషయం గతంలో చాలాసార్లు చర్చనీయాంశమైంది.. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ఇంటర్వ్యూకు సంబంధించి వీడియో వైరల్ కావడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఎన్నో బోల్డ్ సన్నివేశాల్లో నటించిన రాధికా ఆప్టే తెలుగు ఇండస్ట్రీ గురించి ఇలా మాట్లాడడాన్ని తప్పుబడుతున్నారు.