తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సినీ హీరో శ్రీలీల... ఏమన్నారంటే?

Admin 2024-02-19 20:26:18 ENT
ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీలీల కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలయం వెలుపల శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పలు చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు వస్తానని అన్నారు. నేను నటించబోయే సినిమాలను నిర్మాణ సంస్థలు ప్రకటిస్తాయి.

శ్రీలీల ఆదివారం రాత్రి తిరుమల చేరుకుని బస చేశారు. ఆలయం వెలుపల శ్రీలీల దర్శనానికి భక్తులు ఉత్సాహం చూపారు. శ్రీలితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. పెళ్లి సందడి తో సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీలీల వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. పెద్ద హీరోలతో ఛాన్స్ కొట్టేశాడు. బాలయ్యతో చేసిన భగత్ కేసరి, మహేష్‌తో చేసిన గుంటూరు కారం సినిమాలు హిట్ అందుకున్నారు .