ప్రియాంక జవాల్కర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా... ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. 2017లో తెలుగులో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మడు కలవరం ఆయే సినిమాతో వెండితెరపై సందడి చేసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా సినిమా చేసి తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత గమనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా క్రేజ్ రాలేదు.
ఎస్ఆర్ కళ్యాణమండపం హిట్ దర్శకులను ఆకట్టుకోలేకపోయింది. సత్యదేవ్ తో తిమ్మరుసు సినిమాలో కథానాయకుడిగా చేసిన పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి.