ఫిట్ నెస్ కార్యక్రమాలతో రకుల్ బిజీ

Admin 2020-09-21 11:39:11 entertainmen
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వెల్లడించిన లిస్టులో రకుల్ ప్రీత్ పేరు లేదని స్వయంగా పోలీసులే చెప్పడంతో అందరిలోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. రకుల్ అయితే ఈ విషయంపై అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఈ ఘటనలో ఎవరిపైనా ఆరోపణలు చేయని ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఎప్పట్లాగానే తన ఫిట్ నెస్ కార్యక్రమాల్లో మునిగి తేలుతోంది. తాజాగా హైదరాబాదులో బ్యాడ్మింటన్ ఆడుతూ దర్శనమిచ్చింది. బాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో తన పేరు వినిపించిన తర్వాత ఓ పబ్లిక్ ప్లేసులో రకుల్ కనిపించడం ఇదే ప్రథమం.