సంక్రాంతి రేసులో బాలకృష్ణ

Admin 2020-09-21 11:55:11 entertainmen
సంక్రాంతికి తమ సినిమా విడుదల ఉండడాన్ని స్టార్ హీరోలు ప్రెస్టేజ్ గా కూడా ఫీలవుతారు. అందుకే, ఆ సమయానికి రిలీజ్ అయ్యేలా తమ తమ చిత్రాలను ప్లాన్ చేసుకుంటారు. లాక్ డౌన్ కారణంగా పలు చిత్రాల నిర్మాణంలో జాప్యం జరగడం.. మరోపక్క థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ చేసే అవకాశాలు కనిపించకపోవడం కారణంగా ఆయా స్టార్ హీరోలు తమ సినిమాలను వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే సంక్రాంతి రేసులో బాలకృష్ణ కూడా చేరుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.