- Home
- tollywood
బాలీవుడ్ లోకి ఎంట్రీ..అనన్య
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ అనన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. జూనియర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మాయి తన టాలెంట్ తో హీరోయిన్ గా రానుంది.. చాలా సినిమాల్లో నటించిన ఈ భామకు హీరోయిన్ గా స్కోప్ ఉన్న సినిమాలేవీ రాలేదు.. కానీ రీసెంట్ గా వచ్చిన తంత్ర సినిమా మంచి హిట్ కొట్టింది.. ఇప్పుడు జోష్ తో మరో క్రేజీ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.
ఈ భామ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఏంటి అని ఆరా తీస్తే... అవును నిజమే విన్నారు.. అయితే హీరోయిన్ గా కాకుండా రైటర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది.. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో ప్రసారం అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రారంభంలో.. అనన్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఓ స్లయిడ్.. అనన్య షేర్ చేసింది. మొత్తానికి బాలీవుడ్ లో ఏదో ఒక రకంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.