- Home
- bollywood
తర్వాత ఓటీటీలోకి జర హట్కే జర బచ్కే చిత్రం
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జరా హత్కే జరా బచ్కే'. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా గత ఏడాది జూన్‌లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది.
సాధారణంగా ఓ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తుంది.. ఈ సినిమా ఓటీటీకి రావడానికి పదకొండు నెలలు పట్టింది. ఈ నెల 17 నుంచి జియో సినిమాలో ప్రసారం చేయనున్నట్టు ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం చేయనున్నట్టు జియో సినిమాస్ ప్రకటించింది. కొత్తగా పెళ్లయిన మిడిల్ క్లాస్ జంట కలల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.