- Home
- tollywood
ఐదు రోజులుగా నాగశౌర్య పచ్చి మంచినీళ్లు కూడా తాగడం లేదట
క్యారెక్టర్ని బట్టి సిక్స్ ప్యాక్ వంటి బాడీ షేప్ తెచ్చుకోవడానికి వాళ్లు పడే శ్రమ అంతాఇంతా కాదు. ఎన్నో వర్కౌట్స్ తో పాటు కఠినమైన డైట్ కూడా ఫాలో అవుతూవుంటారు. అలాగే యంగ్ హీరో నాగ శౌర్య కూడా తన తాజా చిత్రం కోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం నాగ శౌర్య ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో విలుకాడిగా తను నటిస్తున్నాడు. ఈ పాత్రలో ఎయిట్ ప్యాక్ బాడీ షేప్ తో కనిపిస్తాడు. ఇందుకోసం ఎన్నో వర్కౌట్స్ చేస్తూ.. స్ట్రిక్ట్ డైట్ అనుసరిస్తున్నాడు. క్రమంలో దానిని తెరపై ప్రదర్శించడం కోసం గత ఐదు రోజులుగా నాగశౌర్య పచ్చి మంచినీళ్లు కూడా తాగడం లేదట. అంతెందుకు, లాలాజలాన్ని కూడా మింగకుండా ఆ బాడీ షేప్ ప్రదర్శించడం కోసం ఎంతో రిస్క్ చేస్తూ, శ్రమిస్తున్నాడని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది.