- Home
- bothstates
టాలీవుడ్ డ్రగ్స్ కేసు జాబితాలో 72 మంది పేర్లు..!
హైదరాబాదులో నమోదైన డ్రగ్స్ కేసుల వివరాలను సమాచారహక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంపాదించింది. అయితే గత రెండేళ్లలో 12 డగ్స్ కేసులు నమోదు కాగా కేవలం ఎనిమిది కేసులకు సంబంధించిన ఛార్జ్ షీట్లను మాత్రమే ఫోరం ప్రతినిధులకు అందజేశారు. మిగిలిన నాలుగు కేసుల్లో ఛార్జ్ షీట్లు నమోదు చేయలేదని తెలుస్తోంది. ఈ నాలుగు కేసులు టాలీవుడ్ ప్రముఖులకు చెందినవి కావడం గమనార్హం. దీంతో విచారణపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎనిమిది ఛార్జ్ షీట్లలో డగ్స్ పెడ్లర్లతో పాటు, ఎక్కువగా విద్యార్థులు, ఇతర ప్రముఖుల పేర్లే ఉన్నాయి. మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మొత్తం 72 మంది పేర్లు ఉండగా 12 మంది మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ, మిగిలిన నాలుగు కేసుల్లో సిట్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ నివేదిక వెలుగు చూస్తే ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖుల బండారం బయటపడుతుందని చెప్పారు.