- Home
- tollywood
నవంబర్ నుంచి 'ఆచార్య' షూటింగ్
కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఒక్కొక్కరు మళ్లీ సెట్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 'ఆచార్య' షూటింగ్ ఎప్పటి నుంచి మళ్లీ జరుగుతుందనే కుతూహలం మెగా అభిమానుల్లో వుంది. అయితే, తాజా సమాచారాన్ని బట్టి చిరంజీవి ఇప్పట్లో షూటింగ్ చేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మరో రెండు నెలల తర్వాతే షూటింగ్ చేద్దామని, ప్రస్తుత పరిస్థితులలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదని దర్శక నిర్మాతలకి ఆయన స్పష్టం చేశారట.