- Home
- health
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే 4రకాల లాభాలు
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది బాదం, జీడిపప్పు, పిస్తా, ఇతర డ్రై ఫ్రూట్స్ తింటారు. కొందరు వాటిని నేరుగా తింటే, మరికొందరు నీటిలో నానబెడతారు. సాధారణంగా డ్రై ఫ్రూట్స్‌ని రాత్రంతా తేనెలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నేరుగా కాకుండా ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరానికి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
మనకు అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్‌లో బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష ముఖ్యమైనవి. అవి తక్కువ ఖర్చుతో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్-బి, నియాసిన్, థయామిన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నాయి. ఫ్యాటీ యాసిడ్స్, కాపర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్-బి వంటి పోషకాలు జీడిపప్పులో లభిస్తాయి. ఎండుద్రాక్షలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం, కాపర్, విటమిన్-బి6 మరియు మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
తేనె రుచిలో చాలా తీపిగా ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి-6, విటమిన్ సి మరియు అమినో యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. కానీ బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష.. ఈ మూడు డ్రై ఫ్రూట్స్ తేనెలో నానబెట్టి తింటే శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయి. ఫలితంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అదేంటో చూద్దాం.