చిత్రంపై పలు విమర్శలు.. నెటిజన్ల ట్రోలింగ్

Admin 2020-08-21 12:11:41 entertainmen
జాన్వీ కపూర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం 'గుంజన్ సక్సేనా' ఈ నెల 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ గా రూపొందించిన ఈ చిత్రానికి విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది. అయితే, చిత్రం ఆన్ లైన్లో విడుదలైన తర్వాత సినిమాలో అంత విషయం లేదంటూ రివ్యూలు, కామెంట్లు వచ్చాయి. అసలు అటువంటి పాత్ర పోషించే స్టేచర్ కానీ, మెచ్యూరిటీ కానీ జాన్వీలో లేవంటూ కూడా విమర్శలు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో జాన్వీ బాగా అప్సెట్ అయిందట. దీనిపై జాన్వీ తాజాగా స్పందిస్తూ, గుంజన్ సక్సేనా సినిమాపై వచ్చిన ప్రతి రివ్యూనీ, ప్రతి ట్రోల్ నీ చూశానని చెప్పింది. ఆ ట్రోలింగ్ తనని చాలా బాధ పెట్టిందని పేర్కొంది.