ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుని ఇండస్ట్రీలో చక్రం తిప్పిన నటీమణుల్లో నమ్రతా శిరోద్కర్ ఒకరు.
మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించిన నమ్రత 1993లో మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఆరో స్థానంలో నిలిచింది.
నమ్రతా శిరోద్కర్ 1977లో శతృఘ్న సిన్హా దర్శకత్వం వహించిన 'షిర్డీ కే సాయి బాబా'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తొలిసారి కెమెరా ముందు కనిపించారు. 1998లో విడుదలైన 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై' సినిమాతో కథానాయికగా మారిన ఆమె.. తొలి సినిమా పెద్దగా ఆడలేదు.
అదే ఏడాది 'మేరే దో అన్మోల్ రత్న' సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత హిందుస్తానీ, కచ్చే ధాగే, ఆఘాజ్, అసిత్వ, అల్బేలా, తేరా మేరా సాత్ రహే తదితర 16 సినిమాలు కమర్షియల్‌గా పరాజయం పాలయ్యాయి.
నమ్రతా శిరోద్కర్ బాలీవుడ్‌లో తన 6 సంవత్సరాల కెరీర్‌లో 16 ఫ్లాప్‌లు చేసింది. అందుకే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది, కానీ అక్కడ కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది.
సినిమాల్లో నటిస్తూనే... టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. వంశీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 5 సంవత్సరాల అనుబంధం తరువాత, వారు 2005 లో వైభవంగా వివాహం చేసుకున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార. గౌతమ్ 1 నేనొక్కడినేలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో నటించాడు. ఇక కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వీరందరి ఆస్తులు కలిపి రూ.400 కోట్లకు పైగానే ఉంటాయని సమాచారం.