- Home
- tollywood
బట్టలు ఉతకడం వంటి ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటా: శ్రుతిహాసన్
బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం వంటి అన్ని ఇంటి పనులూ తానే చేసుకుంటానని హీరోయిన్ శ్రుతిహాసన్ చెప్పింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సెలబ్రిటీలు ఇంటి పనులు కూడా చేస్తారా అంటూ చాలామంది ఆశ్చర్యపోతుంటారని తెలిపింది. కొందరు చాలెంజ్ చేశారని చెప్పింది. అయినా ఇటువంటి పనులు చేయడం ఒక ఛాలెంజా? ఆ పనులు అందరూ చేయాల్సినవేనని ఆమె చెప్పింది. ఇక తాను ఇంట్లో ఒంటరిగానే ఉంటానని, ఒంటరితం అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. లాక్‌డౌన్ సమయంలో ఒంటరిగా గడిపినప్పటికీ తనకు బోర్ కొట్టలేదని తెలిపింది.