నేటితో 53వ రోజు అంటూ తాజా ఫోటోని షేర్ చేసింది : ఇలియానా

Admin 2020-09-24 14:38:11 entertainmen
గోవా బ్యూటీ ఇలియానా వైఖరి చాలా విచిత్రంగానే ఉంది. ప్రతి ఒక్కరూ తమను తాము నంబర్ వన్ అనే అనుకోవాలని అంటోంది సన్నజాజి సోయగం ఇలియానా. ప్రాధాన్యత నంబర్ ని ఎవరికి వారు సొంతంగానే ఫిక్స్ చేసుకోవాలట. ఆ కోవలో చూస్తే తనని తాను ఎప్పుడూ నంబర్ వన్ అనే అనుకుంటానని అంది. ఇలియానా తాజా సోషల్ మీడియా పోస్ట్ లో “మీకు మీరే ప్రాధాన్యత సంఖ్య 1 గా చేసుకోవడం ఎలా? నా అభిమాన కవులలో ఒకరు @ventumonce నాకు చెప్పినట్లుగా.. ‘మీలాగే కవిత్వాన్ని ఆరాధించడం ఎలా? మీరు నడవడిక పద్యం కావాలంటే ఎలా?` తన చిన్ననాటి నుంచే తనను తాను మలుచుకున్నానని చెప్పిన ఇలియానా తాజాగా ఇన్ స్టాలో చక్కని చిత్రాన్ని పోస్ట్ చేసింది. వీటిలో ఒక ప్రధాన త్రోబాక్ చిత్రం వైరల్ గానూ మారింది. ఆ ఫోటో సంగతేమో కానీ ఇలియానా లేటెస్ట్ జిమ్మింగ్ ఫోటో ఒకటి అంతర్జాలాన్ని ఓ రేంజులోనే షేక్ చేస్తోంది. ఇటీవల వరుసగా చెమటలు చిందిస్తూ ఇల్లీ జిమ్ చేస్తోంది. నేటితో 53వ రోజు అంటూ తాజా ఫోటోని షేర్ చేసింది. బ్లాక్ ట్రాక్ .. బ్లాక్ ఫ్లోరల్ టాప్ తో ఇల్లీ టాప్ లేపేసింది.