- Home
- bollywood
తెలుగుతో కుస్తీ పడుతున్న అలియా భట్
ఒకప్పుడు తెలుగు అమ్మాయిలైన మన హీరోయిన్లే తమకు తాము డబ్బింగ్ చెప్పుకోలేకపోయేవారు. డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరో ఒకరు వాళ్లకు చెప్పాల్సి వచ్చేది. అయితే, నేటి తరం కథానాయికలు అందుకు భిన్నం.
ముఖ్యంగా ముంబై భామలు చాలా యాక్టివ్ గా వుంటున్నారు. తెలుగులో ఒకటి, రెండు సినిమాలు చేయగానే, తెలుగు మాట్లాడేస్తున్నారు. తమకు తామే డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు.
బాలీవుడ్ భామ అలియా భట్ కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి సిద్ధపడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో చరణ్ సరసన ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రం తెలుగు వెర్షన్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని అలియా నిర్ణయించుకుందట. దాంతో ప్రస్తుతం ట్యూటర్ ని పెట్టుకుని తెలుగు నేర్చుకుంటోందని తెలుస్తోంది.