చదువుకున్న మధ్యతరగతి వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలి

Admin 2020-10-11 16:14:11 entertainmen
మన దేశంలో ఓటర్లు డబ్బుకు, లిక్కర్ కు అమ్ముడుపోవడం, రాజకీయ నాయకులు మందు, డబ్బుతో ఓటర్లను కొనడం సాధారణ విషయంగా మారిపోయింది. ఎన్నికల సమయంలో వేలాది కోట్ల రూపాయలను నీళ్ల మాదిరి ఖర్చు చేస్తుంటారు. దారుణ పరిస్థితిపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ అసహనం వ్యక్తం చేశాడు.

లిక్కర్ కోసం ఓటును అమ్ముకునే వ్యక్తులకు ఓటుహక్కును తొలగించాలని అన్నాడు. డబ్బు కోసం ఓటును అమ్ముకునే వారికి... ఓటుకు ఉన్న విలువ ఏమిటో తెలియదని... అలాంటి వారికి ఓటు హక్కును తొలగించడమే సరైన చర్య అని తెలిపాడు. బాగా డబ్బున్న వాళ్లకు కూడా ఓటు హక్కు అనవసరమని చెప్పాడు. చదువుకున్న, ఓటు విలువ తెలిసిన మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఫిలిం క్రిటిక్స్ అనుపమ చోప్రా, భరద్వాజ్ రంగన్ లతో చిట్ చాట్ సందర్భంగా మాట్లాడుతూ విజయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.