- Home
- tollywood
రాధేశ్యామ్ షూటింగ్ లో ఇబ్బందులపై పూజా హెగ్డే వివరణ
రాధేశ్యామ్ ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇటలీలో జరుగుతోంది. ఇటలీలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో, నటి పూజా హెగ్డే తమ షూటింగ్ అనుభవాలను వివరించారు.
"ఇటలీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. షూటింగ్ లో తొలి రెండ్రోజలు చాలా భయంగా అనిపించింది. ఎంతో ఇబ్బందిగా ఫీలయ్యాను. ఆ తర్వాత మామూలుగా అనిపిస్తోంది. ఇటలీ పరిస్థితులకు అలవాటు పడిపోయాను. ఇటలీలో ఎంతో జాగ్రత్తగా షూటింగ్ చేస్తున్నాం. చిన్న సెట్ వేసుకుని, చాలా తక్కువమందితో చిత్రీకరణ చేస్తున్నాం. సెట్ లోకి అడుగుపెట్టేముందు అందరికీ కరోనా టెస్టులు తప్పనిసరి. సెట్ లో ఉంటే మాస్కు వేసుకోవాల్సిందే. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మాస్కు తీసేస్తున్నాం"