- Home
- international
ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు
తమ ప్రభుత్వాన్ని కూలదోసింది ఆర్మీ చీఫ్ బజ్వాయేనని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఆర్మీ చీఫ్ బూట్లను శుభ్రం చేసే నవాజ్ షరీఫ్ గద్దెనెక్కారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1980లలో మార్షల్ లా విధించినప్పుడు నవాజ్ షరీఫ్ రాజకీయాల్లోకి వచ్చారని.. పాకిస్థాన్ కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న జవాన్లను అవమానించేలా షరీఫ్ మాట్లాడారని మండిపడ్డారు. కేసుల భయంతో విదేశాలకు పారిపోయిన ఒక వ్యక్తి ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్ గురించి మాట్లాడుతున్నారని షరీఫ్ ను ఉద్దేశించి ఇమ్రాన్ విమర్శించారు.