బలమైన ఎముకలకు 5 జ్యూస్ లు

Admin 2024-10-21 12:00:22 ENT
మన శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు అవసరమైన పోషకాలను తీసుకోవాలి. ప్రధానంగా విటమిన్ డి, క్యాల్షియం పుష్కలంగా ఉండే పానీయాలు తీసుకోవాలి. పాలు మరియు పళ్లరసాలు ఎముకలను బలోపేతం చేయడానికి మరియు వాటి సాంద్రతను మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. కాల్షియం మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది. విటమిన్ డి మన శరీరంలో కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ఎముకల పెరుగుదలకు ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.



1) పాలు: పాలు కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ డి యొక్క అద్భుతమైన మూలం. పాలు కేవలం ఆవు పాలు మాత్రమే కాదు, సోయా పాలు, కొబ్బరి పాలతో సహా అన్ని రకాల పాల నుండి మనం మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

2) గ్రీన్ టీ: గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరం చురుగ్గా ఉంటుంది. అంతేకాదు.. కాల్షియం అవసరాన్ని తీరుస్తుంది. ఇది మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది.

3) గ్రీన్ స్మూతీలు: బచ్చలికూరతో సహా అనేక ఆకు కూరలతో చేసిన స్మూతీలు పోషకాలతో నిండి ఉంటాయి. కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె కలిగి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

4) క్యాలీఫ్లవర్ : క్యాలీఫ్లవర్ ను ఉడికించి తింటే క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె లభిస్తాయి.రోజూ తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు, దంతక్షయం వంటి సమస్యలు దూరమవుతాయి.

5) ఆరెంజ్ జ్యూస్: ప్రాసెస్ చేసిన ఆరెంజ్ జ్యూస్ కొని తాగే బదులు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో అవసరమైన కాల్షియం మరియు విటమిన్ సి ఉంటాయి. అవి మన ఎముకలు మరియు కండరాలను బలపరుస్తాయి.