మీకు మద్యం సేవించే అలవాటు ఉందా?

Admin 2024-10-21 12:04:17 ENT
మద్య వ్యసనపరులకు పుట్టిన పిల్లలకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాటీ ఫుడ్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి వల్ల చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటుందని, చిన్నవయస్సులోనే మధుమేహం, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు మద్యం సేవించడం మానుకోవాలని సూచించారు.

మద్యం సేవించడం పురుషులలో సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఎక్కువగా తాగేవారిలో స్పెర్మ్ సెల్స్ సంఖ్య తగ్గుతుంది. దీర్ఘకాలంలో పురుషుల్లో సంతానలేమికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్ తాగే అలవాటు ఉన్న వారికి మరింత ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు. ఈ రెండూ తాగే అలవాటు ఉన్నవారు మానుకోవాలని అధ్యయనం నిర్వహించిన పరిశోధకులు చెబుతున్నారు.