- Home
- tollywood
క్రిష్ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్
హఠాత్తుగా డీ-గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి ప్రయోగానికే రెడీ అయింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో రకుల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ గత నాలుగు రోజులుగా హైదరాబాదు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో నిర్వహిస్తున్నారు. ఇక ఇందులో మన గ్రామీణ ప్రాంతాలలో కనిపించే రైతు కూలీ యువతి పాత్రలో రకుల్ నటిస్తోంది. దీంతో ఆమె మేకప్ లేకుండా.. సాదాసీదా డ్రెస్సింగ్ తో కనిపిస్తుందట.