- Home
- national
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా : సోనియా గాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు.భారత ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్ట దశలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పార్టీలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ చార్జ్ లతో ఓ సమావేశాన్ని నిర్వహించిన ఆమె, కరోనా వైరస్, ఆర్థిక మాంద్యం, ఎస్సీ, ఎస్టీలపై దాడులు తదితరాలను ప్రస్తావించిన ఆమె, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని అన్నారు. ఎన్డీయే సర్కారు తీరుపై విరుచుకుపడుతూ, ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్ట సవరణలు కోట్లాది మంది రైతులు, కౌలుదారులు, కూలీల జీవితాల్లో మరణ శాసనాల వంటివేనని అన్నారు.