- Home
- tollywood
కేరళలోని కోజికోడ్ లో విమాన ప్రమాదం
కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై సినీనటులు మహేశ్ బాబు, అల్లు అర్జున్ స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాద ఘటన తనను ఎంతగానో కలచి వేసిందని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నానని అన్నాడు. గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పాడు.