బ్యాటింగ్ కు వెళుతూ కోపంగా కనిపించిన గేల్

Admin 2020-10-19 14:35:13 entertainmen
ఐపీఎల్ 2020లో భాగంగా జరిగిన మ్యాచ్ లో విజయం రెండు జట్ల మధ్యా దోబూచులాడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రెండు సూపర్ ఓవర్ల వరకూ సాగగా, క్రిస్ గేల్, మయాంక్ లు చివర్లో మెరుపులు మెరిపించి, తమ జట్టుకు విజయాన్ని అందించారు. క్షణాల్లో తన కోపానికి కారణం ఏంటన్న విషయాన్ని గేల్ స్వయంగా వివరించాడు. బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒత్తిడికి లోను కాలేదు కానీ, కోపంగా ఉన్నానని చెప్పిన గేల్, ఎంతో సులువుగా గెలవాల్సిన మ్యాచ్ లో, అటువంటి పరిస్థితి రావడాన్ని చూసి తట్టుకోలేక, ఆందోళన చెందానని చెప్పాడు.