కరోనా వైరస్‌ : స్థానపర వ్యాధి గా మారే అవకాశం

Admin 2020-10-19 14:15:13 entertainmen
కరోనా మహమ్మారికి సంబంధించి శాస్త్రవేత్తలు మరో ఆందోళనకర విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం పాండమిక్ (మహమ్మారి) గా ఉన్న కరోనా వైరస్ భవిష్యత్తులో ఎండెమిక్ (స్థానపర వ్యాధి) గా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంటే టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ వ్యాధి మళ్లీమళ్లీ సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఓ అంచనాకొచ్చారు. ఏదైనా ఒక ప్రదేశానికి పరిమితమై మళ్లీ మళ్లీ సంక్రమించే ‘ఎండెమిక్’ లక్షణంగా కరోనా వైరస్ మారే అవకాశం ఉందని కొలంబియా మెయిల్‌మాన్ స్కూల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి వైరస్ సోకి కోలుకున్న తర్వాత లభించే రోగనిరోధకశక్తి కానీ, వ్యాక్సిన్ ద్వారా లభించేది కానీ ఏడాదిలోపే తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి ఆ తర్వాత కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుందన్నారు.